రాబోయే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్య పద్మావతిని కాకుండా రేవంత్‌రెడ్డి ద్వారా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చారని విమర్శించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి. రేవంత్‌రెడ్డితో మాట్లాడించింది ఉత్తమేనన్న మంత్రి, నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకున్నా పోలీసులు వేధిస్తున్నారంటూ ఉత్తమ్ ఆరోపిస్తున్నారని, ఉత్తమ్ మానసిక స్థితిపై తనకు అనుమానం ఉందని అన్నారు జగదీశ్వర్ రెడ్డి.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉత్తమ్ ఓడిపోయేవారని, ట్రక్ గుర్తుతో బయటపడ్డారని, పైగా ఉత్తమ్‌ను నియోజకవర్గంలో ఆంధ్ర వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు.