కెసిఆర్ రాజీనామా చేయాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి - Tolivelugu

కెసిఆర్ రాజీనామా చేయాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కెసిఆర్ తెలంగాణ ను ఉద్దరిస్తాడని ప్రజలు పట్టం కడితే తెలంగాణ ను సర్వ నాశనం చేసారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి . జగన్ కెసిఆర్ కలయిక తెలంగాణ సమాజానికి గొడ్డలి పెట్టు కాబోతోందన్నారు . 6 నెలల ముందు నుండే పోతిరెడ్డిపాడు కుట్రకు తెరలేపారన్నారు .

30 లక్షల ఎకరాల సాగునీరు, హైదరాబాద్ తాగునీరుకు ఇబ్బంది కలిగే ఈ అంశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కెసిఆర్ ఇంటి సమస్య కాదని, తెలంగాణ సమస్య అన్నారు. ప్రజల జీవితాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతొ దోపిడీ చేస్తూ , మనకు రావాల్సిన కృష్ణా నీటి వాటాను కూడా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు . ఆ స్థానంలో కూర్చునే హక్కు లేదన్నారు .

Share on facebook
Share on twitter
Share on whatsapp