హైదరాబాద్, తొలివెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, గోల్కొండ కోటపై జెండా ఎగరేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులను మభ్యపెట్టి గద్దెనెక్కిన కేసీఆర్..వాళ్ల యోగక్షేమాలు, ఆకాంక్షలు మర్చిపోయారని. తాము పవర్ లోకి వచ్చిన మరుక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్. నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నఆయన..నిరుద్యోగంపై కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు.
ఆనాడు తెలంగాణ నిరుద్యోగుల హక్కులను ఇందిరాగాంధీ కాపాడారని గుర్తు చేశారు. బిస్వాల్ కమిటీ లక్షా తొంభై ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి8 సంవత్సరాలు అయిందనీ..తమ కుటుంబంలో తప్ప కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని సెటైర్లు వేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం గురించి చెప్తూ..చిన్నారెడ్డి ఎమ్మెల్యే గా పోటీ చేస్తే తాను గోడల మీద రాతలు రాసాననీ, యూత్ కాంగ్రెస్ లో కొట్లాడిన వాళ్ళకే టికెట్లు వస్తాయని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు అధికారం కంటే రేవంత్.కాంగ్రెస్ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనే బాధ్యత తనకు ఇష్టమన్నారు.
ఇక.. మధ్యలో వచ్చిన టిఆరెస్ తెలంగాణకి తామే ఓనర్లం అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.అంటేగా..యువకుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం ఆడదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు.. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ చేతకాక ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నాడంటూ హేళన చేశారు.