1989 లో భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ sc, st అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా రూపొందించారు. దళిత, గిరిజనులను హత్య చేసిన అవమాన పర్చిన వారికి నష్టం చేసినవారిని కఠినంగా శిక్షిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉద్యోగం, 3నుండి 5 ఎకరముల భూమి, ఉచిత గృహం, పింఛన్, ఉచిత విద్య అందించాలని 1989లొనే కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను తెచ్చారు. నేడు trs ప్రభుత్వం కొత్తగా sc లకు వరాలు ప్రకటించడం అక్షర్యంగా ఉంది. ఉన్న రాయితీలను trs ప్రకటించింది.
గతంలో దేశ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలను రూపొందించింది, ఆచట్టాలను సవరిస్తూ రెండవ సారి ప్రధాని అయిన నరేంద్రమోదీ కొత్త చట్టాలను తేవడం మూలన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో ఆందోళనలు జరుగుతున్నాయి. 1950 లో నెహ్రూ ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం తెచ్చారు, ఈ చట్టం ప్రకారం ప్రజా రవాణా కు చెందిన దారులన్నీ జాతీయం చేయబడ్డావి ఈ రూట్ లల్లో ప్రవేట్ వాహనాలు తిరుగరాదు, ప్రజా రవాణా చేయరాదని ఈ చట్టం చెబుతుంది. అయితే 2019లో మోడీ ప్రభుత్వం మోటారు వాహన చట్టం సెక్షన్ 3 ని సవరించి, సెక్షన్ 67 ను రూపొందించింది, ఈ చట్టం ద్వారా ప్రభుత్వ రూట్లలో ప్రయివేటు వాహనాలు ప్రజా రవాణా చేయుటకు అనుమతులు మంజూరు చేయడానికి రాష్ట్రాలకు అనుమతులు కేంద్రం ఇచ్చింది.
కేంద్ర సూచన మేరకు సెక్షన్67 ప్రకారం తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం RTC ని ప్రయివేట్ పరం చేయుటకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు, ఎప్పటి నుంచో RTC ని ప్రయివేటు చేయాలని చూస్తున్న కేసీఆర్ కు సెక్షన్ 67 తోడైంది. కాంగ్రెస్ ఇచ్చిన్న 1950 మోటారు వాహన చట్టాన్ని సవరించుట మూలన బీజేపీ దొంగకు తాళాలు ఇచ్చినట్లు అయింది. 20 మంది కార్మికులు చనిపోవడానికి , RTC సమ్మె తీవ్రతరం కావటానికి రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడటానికి TRS తో పాటు BJP కూడా కారణమే, చట్టాలు ప్రజలకు మేలుచేయాలి కానీ కీడు చేయరాదు. BJP కార్మికుల సమ్మె పై. ముసలి కన్నీరు మానేసి మోడీ తో మాట్లాడి RTC ని ప్రయివేటు పరం కాకుండా కాపాడాలని డిమాండు చేస్తున్నాము. లేకపోతే ప్రజా కోర్ట్ లో రెండు పార్టీ లకు శిక్ష తప్పదు.