టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది.
14 నుంచి భూదాన్ పోచంపల్లిలో ప్రారంభం కానున్న సర్వోదయ పాదయాత్ర, కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల ఖాళీల ప్రకటన గురించి చర్చించనున్నాట్టు తెలుస్తోంది.
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కొల్లాపూర్ లో జరగనున్న మన ఊరు-మన పోరు సభ, డిజిటల్ మెంబెర్షిప్ ప్రగతి తదితర అంశాలపై చర్చ జరుగుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.