రిపబ్లిక్ డే రోజు దేశ రాజధానిలో కిసాన్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అతనికి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసుల విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొనట్టుగా సమచారం.
మరోవైపు ఢిల్లీలో ఘర్షణల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. చివరిసారిగా ఎర్రకోటలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లిన సమయంలో ఫేస్‌బుక్ లైవ్‌లో కనిపించి.. ఎర్రకోటపై రైతులు జెండాను ఎగరవేసిన విషయాన్ని చెప్పాడు.ఇదిలా ఉంటే ఢిల్లీ అల్లర్లపై పోలీసులు 25 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు..ఇందుకు సంబంధించి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సోషల్ మీడియాకు సంబంధించి 400 అకౌంట్లను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది.