ఉదయం నుండి నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు కోల్పోయి.. 54,470కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి.. 16,301కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3.44%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.03%, ఇన్ఫోసిస్ 1.91%, మారుతి 1.32%, బజాజ్ ఫిన్ సర్వ్ 1.25% వద్ద మగిశాయి.
టాప్ లూజర్స్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ -4.30%, నెస్లే ఇండియా -2.88%, ఇండస్ ఇండ్ బ్యాంక్ -2.69%, టాటా స్టీల్ -2.67%, టెక్ మహీంద్రా -2.52% వద్దకు పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై మదుపరులు దృష్టి సారించారు. అయినప్పటికీ చివరకు ట్రేడ్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.