కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా అంచనాలతో విడుదలైంది. కానీ, ఓపెనింగ్స్ తో ఆకట్టుకోలేకపోయింది. ‘బింబిసార’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా కావడంతో చాలామంది ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ సినిమా కోలుకునే అవకాశం లేదు.
పఠాన్ మాత్రం దూసుకుపోతోంది. మూడో వారాంతం కూడా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. షారూక్, దీపిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. మరికొన్ని రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది ఈ సినిమా.
ఇక రైటర్ పద్మభూషణ్ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. చాయ్ బిస్కెట్ బ్యానర్ పై సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ క్లిక్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.
ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య ఇప్పటికీ తన పట్టు నిలుపుకుంది. మేజర్ సెంటర్స్ లో ఈ సినిమాకు ఇంకా వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ కు దీని రన్ క్లోజ్ అయ్యేలా ఉంది.
సితార బ్యానర్ పై నిర్మించిన బుట్టబొమ్మ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ ప్రభావం చూపించలేదు. మలయాళ హిట్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా.. టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో ఫెయిలైంది.