జాన్ అబ్రహం విలన్ పాత్రలో షారూక్-దీపికా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పఠాన్. ఈ చిత్రం భారత్ లో అన్ని చోట్లా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అతి తక్కువ సమయంలోనే భారీ వసూళ్లు రాబట్టడంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పింది.ఇప్పటికే ఈ చిత్రం 560 కోట్ల రూపాయలను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అయింది.
ఇక చిరంజీవి హీరోగా నటించిన వాల్టేర్ వీరయ్య సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారాంతం పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు వచ్చేవన్నీ లాభాల కిందే లెక్క. ఓవర్సీస్ లో కూడా ఇంకా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతున్నాడు వీరయ్య.
బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాకు మొదట్లో అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది. అయితే, రెండవ రోజు నుండి ఆక్యుపెన్సీ పడిపోయింది. అలా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లేట్ అయింది. సంక్రాంతి బరిలో నిలవడం వల్ల బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ, ఎక్కువమంది ప్రేక్షకుల్ని ఇది ఆకర్షించలేదు.
ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా ఎలాంటి హైప్ లేకుండా రిలీజైంది. అలానే పేలవంగా ముగిసింది. ఈ సినిమాకు కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. సుధీర్ బాబు ఇమేజ్ ఈ రీమేక్ సినిమాను కాపాడలేకపోయింది. ఈ సినిమా రన్ దాదాపు ముగిసింది.