అధికార టిఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకూ అందరూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వరంగల్ లో నిత్యం మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వారికి కాకుండా టిఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్లకు సంబంధించిన బంధువులకు కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో ఫ్లాట్లు ఫామ్ లు కేటాయించారు అధికారులు. దీనితో వ్యాపారులంతా కూడా ఆందోళనకు దిగారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ నుండి ఉమ్మడి జిల్లా తో పాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు కూరగాయలు సరఫరా చేస్తూ ఉంటారు. పాత మార్కెట్ శిథిలావస్థకు చేయడంతో నాలుగు కోట్ల రూపాయలతో కొత్త మార్కెట్ నిర్మించారు.
అందులో 95 మంది వ్యాపారులకు షెల్టర్లు ,158 మందికి షెడ్ లోని ప్లాట్ ఫామ్ కేటాయించారు. మరో 195 మందికి ఓపెన్ స్థలంలో ఫ్లాట్ ఫామ్ లు కేటాయించారు.
ఈ కేటాయింపులో అర్హులైన వారందరికీ కాకుండా స్థానిక శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ అనుచరులకు, కార్పొరేటర్ బంధువులకు కేటాయించారని వారంతా కూడా ఆందోనళకు దిగారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.