హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ మళ్లింపు ఉందని… వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు ఏయే రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో ప్రకటించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అనే నినాదంతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఈనెల 12న ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో 12వ తేదీన ట్రాఫిక్ మళ్లింపులుంటాయని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ఇవే-
1. ఎంజే మార్కెట్ నుంచి మెహిదీపట్నం వెళ్లే వాహనాలను ఏక్‌మినార్-బజార్‌ఘాట్, ఆసిఫ్ నగర్‌ల మీదుగా మళ్లిస్తారు.
2. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి పబ్లిక్‌గార్డెన్ వైపు వెళ్లే వాహనాలను చాపెల్ రోడ్ టీ జంక్షన్- గన్‌ఫౌండ్రి, అబిడ్స్ వైపునకు మళ్లిస్తారు.
3. నిరంకారిభవన్, ఖైరతాబాద్ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే వారిని సైఫాబాద్ పాత పీఎస్- టెలిఫోన్ భవన్- ఇక్బాల్‌మినార్- సచివాలయం రోడ్- తెలుగుతల్లి వైపునకు అనుమతిస్తారు.
4. హైదర్‌గూడ- కింగ్‌కోఠి వైపు నుంచి కంట్రోల్ రూం వైపు వెళ్లే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్‌టీఆర్‌మార్గ్, ఇక్బాల్‌మినార్ వైపు మళ్లిస్తారు.
5. ట్యాంక్‌బండ్ నుంచి రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి టెలిఫోన్ భవన్, లక్డీకాపూల్ వైపు అనుమతిస్తారు.
ఫ్లై ఓవర్‌ల మూసివేత :
గురువారం రాత్రి షబ్-ఏ-మేరాజ్ (జాగారం) ఉన్నందున రాత్రి 10గంటల తర్వాత అన్ని ఫ్లైఓవర్లు మూసి ఉంటాయని సీపీ వెల్లడించారు. అయితే పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ వే, లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్లపై మాత్రం అనుమతి ఉంటుందని తెలిపారు.