హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విదించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల వాహనాల మళ్లింపు కూడా చేశారు. గణపతి విగ్రహాలు తప్ప ఇతర వాహనాలకు రోడ్లపైకి అనుమతి లేదని, అత్యవసర పనులు ఉన్నవారు మెట్రో, ఎంఎంటీఎస్‌లను వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల కోసం మెట్రో రైలు వేళల్ని కూడా అధికారులు పొడిగించారు.