నల్గోండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో మినీ చాపర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ తోపాటు ట్రైనీ పైలట్ మృతి చెందారు.
చాపర్ వ్యవసాయ పొలాల్లోనే కుప్పకూలింది. ఆ సమయంలో పెద్ద శబ్ధం, దట్టమైన పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళనకు గురయ్యారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదస్థలికి రెవెన్యూ, వైద్య సిబ్బంది కూడా వచ్చారు.
పొలంలో పనులు చేస్తుండగా.. ఏదో పిడుగు పడిన శబ్దం వినిపించిందని.. ఓచోట మంటలు, పొగలు రావడం గమనించి.. ఎవరిదైనా పంట కాలిపోతుందేమోనని అక్కడకు వెళ్లామని చెప్పారు రైతులు. విమానం పడిపోయి ఉందని.. అందులో నుంచి కాసేపు అరుపులు వినిపించాయని తెలిపారు.