ట్రాక్ మరమ్మత్తుల కారణంగా గూడురు-తిరుపతి సెక్షన్ల మధ్య నడిచే పలు రైళ్లలో కొన్నింటిని రద్దు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించనుంది. గుంతకల్ డివిజన్ లో రద్దయిన రైళ్లతో పాటు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇవే.
రద్దయిన రైళ్లు-
1. భువనేశ్వర్- తిరుపతి ప్రత్యేక రైలు(08479)- 19.12.2020నాడు భువనేశ్వర్ నుండి బయలుదేరే రైలు రద్దయింది.
2. తిరుపతి-భువనేశ్వర్ ప్రత్యేక రైలు(08480)- 20.12.2020 నాడు తిరుపతి నుండి బయలుదేరే ప్రత్యేక రైలు రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు-
1. యశ్వంత్ పూర్-టాటా ప్రత్యేక రైలు(02890)- 21.12.2020నాడు యశ్వంత్ పూర్ నుండి బయలుదేరి కడప, మేలపాకం, రేణిగుంట, గూడూరు మీదుగా తిరుపతికి వెళ్లకుండా వెళ్తుంది.
2. యశ్వంత్ పూర్-హతియా ప్రత్యేక రైలు(02836)- 25.12.2020నాడు యశ్వంత్ పూర్ నుండి బయలుదేరే రైలు కట్పాడి, మేలపాకం, రేణిగుంట, గూడురు నుండి మళ్లించారు. చిత్తూరు, తిరుపతికి రాకుండానే దారి మళ్లించనున్నారు.