జూన్ 1 నుండి దశల వారీగా రైళ్ల సేవలను పునరుద్ధరిస్తామని రైల్వే ప్రకటించింది. రిజర్వేషన్లు లేకుండా నేరుగా టికెట్ కొని ప్రయాణించాల్సిందే. టికెట్ కొనేందుకు ఐ.ఆర్.సి.టీ.సి వెబ్ సైట్ ఉపయోగించుకోవాలని సూచించి, రైళ్ల లిస్ట్ ను విడుదల చేసింది రైల్వేశాఖ.
ఏపీ-తెలంగాణ నుండి నడిచే రైళ్ల వివరాలు
ప్రతి రోజూ
ముంబయి-హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02)
హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04)
హైదరాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24)
దానాపూర్- సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92)
విశాఖపట్నం- ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06)
గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02)
తిరుపతి- నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94)
హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28).
దురంతో రైళ్లు:
సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) (వారానికి రెండుసార్లు)
30 రోజుల ముందు నుండే ఈ టికెట్లను తీసుకునేందుకు రైల్వేశాఖ వీలు కల్పించింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లను పూర్తిగా రద్దు చేయగా… ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ కూడా నిబంధనల ప్రకారం జారీ చేయనున్నారు.
సికింద్రాబాద్- విజయవాడ మీదుగా నడిచే రైళ్లు
హావ్‌డా-యశ్వంత్‌పూర్ (వయా విజయవాడ) దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/46).. వారానికి ఐదు రోజులు
ముంబయి సీఎస్‌టీ- భువనేశ్వర్ (వయా సికింద్రాబాద్, విజయవాడ) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (01019/20).. ప్రతిరోజు