మహారాష్ట్ర రాజకీయ పార్టీ శివసేనకు ఎన్నికల సంఘం గట్టి షాకిచ్చింది. శివసేన నుంచి రెండు వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ సభ్యుల్లో ఎవరూ కూడా పార్టీ గుర్తును వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.
తూర్పు అంధేరీ అసెంబ్లీ స్థానంలో జరిగే ఎన్నికల్లో రెండు వర్గాల్లో ఎవరూ కూడా విల్లు బాణం గుర్తును ఉపయోగించకూడదని తెలిపింది. దీనిపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు.
‘కోట్లకు అమ్ముడుపోయిన ద్రోహులు చివరకు పార్టీ గుర్తును కూడా స్తంభింపజేశారు. ఈ నీచమైన చర్యను మహారాష్ట్ర ప్రజలు సహించబోరు. మేం పోరాడి గెలుస్తాం. మేమంతా నిజం వైపు ఉన్నాం. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
खोकेवाल्या गद्दारांनी आज शिवसेना नाव आणि चिन्ह गोठवण्याचा नीच आणि निर्लज्ज प्रकार केला आहे. महाराष्ट्राची जनता हे सहन करणार नाही.
लढणार आणि जिंकणारच!
आम्ही सत्याच्या बाजूने!
सत्यमेव जयते! pic.twitter.com/MSBoLR9UT5
— Aaditya Thackeray (@AUThackeray) October 8, 2022
ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆయన దీన్ని డిలీట్ చేశారు. ఆ వెంటనే మళ్లీ పోస్ట్ చేయడం గమనార్హం.కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం వాలంటరీగా పార్టీని వీడారని, కాబట్టి వారికి తమ పార్టీ గుర్తు ఉపయోగించుకునే హక్కు లేదని ఎలక్షన్ కమిషన్‌కు థాకరే వర్గం తెలిపింది.
అయితే తమదే నిజమైన శివసేన అని, తామంతా పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే అడుగుజాడల్లో నడుస్తున్నామని షిండే వర్గం అంటోంది.