భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అంటే మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు ట్రాన్స్ జెండర్ యువకుడు. కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట అమ్మానాన్నలు కాబోతున్నారు. దీంతో మా కలలు నెరవేరబోతున్నాయి అంటూ వారు ఇన్ స్టా వేదికగా తమ సంతోషాన్ని షేర్ చేశారు.
‘అమ్మను కావాలనుకునే నా కల, నాన్న కావాలనుకునే తన కోరిక త్వరలోనే నెరవేరబోతోంది అంటూ ఇన్ స్టా వేదికగా వెల్లడించారు అని అమ్మాయిలా మారిన 23 ఏళ్ల జియా పావెల్. తమ కలల ప్రతీరూపానికి స్వాగతం పలటానికి ఈ ట్రాన్స్ జెండర్ జంట ఎంతో ఆశతో..ఆకాంక్షలతో ఎదురు చూస్తోంది.
గర్భం దాల్చేందుకు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల బృందం వెల్లడించిటంతో జహాద్ బిడ్డకు జన్మనివ్వటానికి సిద్దమయ్యాడు.
అలా గర్భం దాల్చాడు. తన స్త్రీత్వాన్ని నిలుపుకుంటూనే గర్భవతి కావాలని నిర్ణయించుకున్నాడు జహాద్. పుట్టిన బిడ్డ పాల కోసం ఈ జంట కోజికోడ్‌లోని రొమ్ము పాల బ్యాంకులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సహకారంతో శిశువుకు ఆహారం అందించాలని భావిస్తున్నారు.