రాష్ట్రంలో వరుసగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. అదనపు కలెక్టర్ హోదా.. నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడంతో పాటు.. వెయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్ గా జి.పద్మజారాణి, రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గా ఖిమ్యానాయక్ కు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వరంగల్ అదనపు కలెక్టర్ గా కే. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వైవీ. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా ఎం.డేవిడ్ లను నియమించింది.
ఇప్పటి వరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న పీ. శ్రీనివాసరెడ్డిని సిద్ధిపేటకు బదిలీ చేశారు. అంతేకాకండా.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు.
చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్‌కుమార్ తో పాటు.. బీ. సంతోషిని ని.. హైదరాబాద్ జిల్లా భూపరిరక్షణ ఎన్డీసీగా ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలువురు నాన్ కేడర్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.