నాన్ కేడర్ ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్ రంగారెడ్డిని పీసీఎస్ అండ్ ఎస్ఎస్పీగా నియమించారు. ఆర్ వెంకటేశ్వర్లును సీఐడి విభాగంలో ఎస్పీగా నియమించారు.
జే రాఘవేందర్ రెడ్డిని రైల్వేస్ లో అడ్మిన్ ఎస్పీగా నియమించారు. గ్రేహౌండ్స్ లో ఏఎస్పీగా ఉన్న యోగేష్ గౌతంకు సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.
ఇంతకు ముందు నాన్ కేడర్ ఎస్పీ పూజను టీఎస్ పీఏ డిప్యూటీ డైరెక్టర్ గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆమె ఇంతకు ముందు పని చేసిన వరంగల్ పోలీస్ ట్రైనింగ్ పోస్టులోనే కొనసాగుతారని పేర్కొన్నారు.
పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సతీష్ ను డీజీపీ కార్యాలయంలో లీగల్ ఎస్పీగా నియమించారు. మురళీధర్ కు వరంగల్ క్రైమ్స్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.