ఆర్టీసీ లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదన్నారు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. వారికి కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వాడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని ప్రతిపక్షాల విమర్శలు చేశారు మంత్రి.
కరోనా వలన ఆర్టీసీకి వచ్చిన ఆర్థిక సంక్షోభం వలన మాత్రమే జీతాలు చెల్లించలేకపోయామని తెలిపారు. ఎవరిని తొలగించము యధావిధిగా కొనసాగుతారు. మా ప్రభుత్వం లో ఉద్యోగాలు కల్పనే గాని,తొలిగింపు ఉండదన్నారు.