జగన్ సర్కార్ పై అన్ని వర్గాల నుంచి రోజురోజుకీ వ్యతిరేకత పెరుగిపోతోంది. విజయవాడలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ తీయగా.. తాజాగా టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో రవాణారంగ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భిక్షాటన చేశారు కార్మికులు. జగన్ చెప్పేదొకటి చేసేదొకటని ఆరోపించారు కార్మికులు. రవాణా రంగంలోని కార్మికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఒక చేత్తో ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి.. మరో చేత్తో రూ.50 వేలు ప్రభుత్వం లాగేసుకుంటోందని మండిపడ్డారు కార్మికులు. రోజంతా కష్టపడిన సంపాదన జరిమానాలు, ట్యాక్స్ ల రూపంలోనే పోతోందని వాపోయారు.
కుటుంబాలను పోషించుకోలేక అడుక్కునే పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని వాపోయారు.