కేరళలోని ఆలయాలు. ఆలయ పరిసరాల్లో ఆర్ఎస్ఎస్ సామూహిక డ్రిల్స్ ను, ఈ సంస్థ నిర్వహించే ఇతర కార్యకలాపాలను నిషేధిస్తూ ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. కేరళలో సుమారు 1200 ఆలయాల పర్యవేక్షణా బాధ్యతలను ఈ సంస్థ చూస్తోంది. తమ పరిధిలోని గుడులలో ఆర్ఎస్ఎస్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలని ఆయా ఆలయాల కమిటీలను ఆదేశించింది.
తమ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా బోర్డు హెచ్చరించింది. మీడియాతో మాట్లాడిన ఈ బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపన్.. ఆర్ఎస్ఎస్ విభాగాలు అనేక ఆలయాల్లో డ్రిల్స్ నిర్వహిస్తున్నాయని, వీటివల్ల ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగరాదన్నారు.
అయితే ఫెస్టివల్స్ జరుగుతున్నాయి గనుక తాము ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని చెప్పిన ఆయన .. ఆర్ఎస్ఎస్సే కాకుండా మరికొన్ని సంస్థలు కూడా ఈ విధమైన డ్రిల్స్ నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటిని తాము ఖండిస్తున్నామన్నారు. 2021 మార్చిలో కూడా బోర్డు ఈ తరహా సర్క్యులర్ నే జారీ చేసింది.
టెంపుల్స్ ఆవరణలో ఆయుధ శిక్షణ ఇవ్వరాదని 2016 లోనూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తరచూ ఇలాంటివి జరగడం పట్ల బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. తాజా సర్క్యులర్ పై స్పందించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ..ఇది అప్రజాస్వామికమని, మా నియమావళిని హరించడమేనని పేర్కొంది. ఆలయాల్లో మా విభాగాలు ఆయుధ శిక్షణ ఎప్పుడూ ఇవ్వలేదని తెలిపింది. కానీ కాంగ్రెస్ మాత్రం ..ట్రావన్ కూర్ బోర్డు నిర్ణయాన్ని స్వాగతించింది. ఆర్ఎస్ఎస్ వారు తమ అరాచకపు డ్రిల్స్ ను ఆలయాల్లో కాకుండా మరెక్కడైనా నిర్వహించుకోవచ్చునని ఈ పార్టీ నేత ఉదిత్ రాజ్ అన్నారు.