కరోనా వైరస్ ఒక్కో సీజన్ లో ఒక్కో రూపంలో అభివృధ్ది చెందుతూ వస్తోంది. ఈ సారి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. విదేశీ ప్రయాణాలను నిలిపివేసింది. అయితే.. ప్రయాణాలపై నిషేధం విధించడం కన్నా, పరీక్షలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోనే మేలు జరుగుతుందని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు.
వృద్ధులు, ఇతరత్రా వ్యాధులు ఉన్నవారికి మూడో విడత బూస్టర్ డోసు ఇస్తే మంచిదని సూచించారు గగన్ దీప్. డెల్టా తరహా వైరస్ కన్నా ఒమిక్రాన్ అధికంగానే ఉంటుంది. అందువల్ల ఒకసారి వైరస్ సోకిన వారికి, టీకాలు వేయించుకున్నవారికి కూడా మళ్లీ కరోనా వచ్చే ప్రమాదం ఉందని గగన్ దీప్ కాంగ్ వెల్లడించారు.