వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో పెద్ద ఎత్తున గుంతలు తెల్లారే సరికి దర్శనమిచ్చాయి. గుప్త నిధుల కోసంమే తవ్వకాలు జరిపినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
మండల పరిధిలోని పలు చోట్ల తరచుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు చెపుతున్నారు. అయితే ఇటీవల గుప్తనిధుల వేటకు వెళ్లన ఓ వ్యక్తి ఉట్నూర్ ప్రాంతంలో మరణించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.