టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దాంతో నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన ప్యారలల్ గా ‘గాడ్ ఫాదర్’,‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
అలా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తు్న్నారు చిరంజీవి. కోలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’కు రీమేక్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, చిరుకు జోడీగా తమన్నా భాటియా కనిపించనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపించనున్నారట. ‘ఖుషీ’ సినిమాలోని ‘‘నడుము’’ సీన్‌ను ఇందులో పెట్టినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్‌గా చిరంజీవి, భూమికగా శ్రీముఖి ఈ చిత్రంలో కనిపిస్తారని టాక్. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పవన్ అభిమానులు మాత్రం డైరెక్టర్ మెహర్ రమేశ్‌ను హెచ్చరిస్తున్నారు. ‘‘ఖుషీ’’ నడుము సీన్ ఎవర్ గ్రీన్ సీన్ అని, దానిని పాడు చేయొద్దని, జాగ్రత్తగా తీయాలని సూచిస్తున్నారు.