కేరళలో కొండపై చిక్కుకుని చావుకు బతుక్కు మధ్య పోరాటం చేసిన వ్యక్తిని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయింది. సుమారు 45 గంటల పాటు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కొండ మీదే ఉన్న వ్యక్తిని ఆర్మీ సురక్షితంగా కాపాడగలిగింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…
మలమ్ పూజాలోని చెలాడ్ గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కులుంబాచీ అనే కొండపై ట్రెక్కింగ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో కొండపైకి బాబు ఉత్సాహంగా ఎక్కాడు. కొండపై కొంత సమయం స్నేహితులతో కలిసి ఆనందగా గడిపాడు. ఆ తర్వాత కొండపై నుంచి దిగుతున్న సమయంలో కొండమీద నుంచి కాలు జారాడు.
అయితే జారుతున్న సమయంలో కొండ వాలులో ఇరుక్కు పోయాడు. బాబును కాపాడేందుకు అతని స్నేహితులు కొండపై నుంచి కర్రల సాయంతో ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో వారు ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆర్మీ సహాయాన్ని కోరారు.
దీంతో రంగంలోకి దిగిని ఆర్మీ అధికారులు బాబును కాపాడే ప్రయత్నం చేశారు. కొండ అంచులపై హెలికాప్టర్ ను ఆపి అతన్ని రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకి అతనికి ఆహారం, తాగు నీరు అందించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు.
ఈ నేపథ్యంలో అధికారులు మరో మారు అధికారులు బుధవారం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సారి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో బాబును సురక్షితంగా కిందకు తీసుకు రాగలిగారు. మొత్తానికి 45 గంటల తర్వాత యువకుడుకు కిందకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు…