ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి అంటే ఇదే కావచ్చు.. కూలికని పోయిన మనిషి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అరే అదెట్లా అంటరా.. అయితే ఇది చదవాల్సిందే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్ అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ జీవించే వాడు.అయితే ఓ రోజు రాష్ట్రంలోని పన్నా గనుల్లోకి కూలి పనికి పోయాడు ములాయం. అక్కడే అతని దశ తిరిగింది.
Also Read: ఇక్కడ నాలుగున్నర రోజులే పనిదినాలు
కృష్ణ కల్యాణ్ పుర్ పట్టి గనిలో కార్మికులు జరుపుతున్న తవ్వకాల్లో రూ.60 లక్షలు విలువ చేసే 13.54 క్యారెట్ల వజ్రం ములాయం చేతికి చిక్కింది. దీంతోపాటే మరో ఆరు చిన్న వజ్రాలు ములాయంతో పాటు పనుల్లో ఉన్న సహ కార్మికులకు దొరికాయి. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఒకేరోజు దొరికిన ఈ 7 వజ్రాల విలువ దాదాపు రూ.కోటి వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలం వేస్తేనే కానీ వీటి అసలు విలువ తెలుస్తోందని అంటున్నారు. పన్నా గనులకు ఇది ‘డైమండ్ డే’ అని అధికారులు చెపుతున్నారు. ఈ డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటానని ములాయం చెప్పారు.
Advertisements