జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ కేసులో ట్రైబ్యునల్ కీలక తీర్పునిచ్చింది. సొసైటీలో ఐదుగురి సభ్యత్వాన్ని ట్రైబ్యునల్ పునరుద్దరించింది. సభ్యులను తొలగిస్తూ సొసైటీ జారీ చేసిన ఆదేశాలను చట్టవిరుద్దమైనవి పేర్కొంటూ వాటిని ట్రైబ్యునల్ కొట్టి వేసింది.
తెలంగాణ కోఆపరేటివ్ ట్రైబ్యునల్ తన తాజా ఉత్తర్వుల ప్రకారం… సొసైటీ సభ్యులను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించే సమయంలో చట్ట ప్రకారం నిర్దేశించిన నిబంధనలను పాటించలేదని ట్రైబ్యునల్ పేర్కొంది. దీంతో ఈ ఆదేశాలను ట్రైబ్యునల్ రద్దు చేసింది.
సభ్యుల ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తూ సొసైటి తీసుకున్న చట్టవిరుద్ధమైన, ఏకపక్ష ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టి వేసింది. వారి సభ్యత్వాన్ని పునరుద్దరించాలని ఆదేశించింది. ఏ . మురళీ ముకుంద్ సభ్యత్వాన్ని సొసైటీ తొలగించే నాటికి ఆయన సొసైటీలో సెక్రటరీగా ఉన్నారు.
ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఆయన తన సెక్రటరీ పదవిని తిరిగి పొందనున్నారు. ట్రైబ్యునల్ తాజా తీర్పు నేపథ్యంలో సొసైటీ అధ్యక్షుడు, కమిటీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇకనైనా కమిటీ తన పద్దతి మార్చుకుంటుందో లేదో అదే నియంతృత్వ పోకడలను కొనసాగిస్తుందో చూడాలని కొందరు సభ్యులు అంటున్నారు.