పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్నిరోజులు ఏదో ఒక కారణంగా పార్లమెంట్ సభల్లో ఎంపీలు నిరసలు తెలుపుతూనే ఉన్నారు. దాంతో కొంతమంది ఎంపీలపై వేటు కూడా పడింది. అయితే సోమవారం లోక్‌సభలో ఎంపీ కకోలి ఘోస్ దస్దీదార్ చాలా వినూత్నంగా ధరల పెరుగుదలపై నిరసన తెలియజేశారు. తృణమూల్ ఎంపీ లోక్‌సభలో లేచి నిలబడి ఒక పచ్చి వంకాయను కొరికారు. దేశంలో ధరల పెంపుపై జరుగుతున్న చర్చ సందర్భంలో ఆమె ఇలా చేశారు.
లోక్‌సభలో సోమవారం ధరల పెరుగుదలపై చర్చ ప్రారంభించిన చాలా సమయానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోస్ దస్తీదార్‌కు అవకాశం ఇచ్చారు. దాంతో ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించినందుకు మొదటగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం “వంట గ్యాస్ ధర పెరిగిపోయింది వంట ఎలా చేసుకోవాలి. మేం పచ్చి కూరగాయలు తినమని ప్రభుత్వం కోరుకుంటుందా..?” అని ప్రశ్నిస్తూనే చేతిలో ఉన్న వంకాయను ఆమె కొరికారు. పెరిగిన వంట గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతేకాదు గత కొన్ని నెలల్లో నాలుగుసార్లు వంట గ్యాస్ ధర పెరిగిందని, రూ.600 నుంచి రూ.1100కి రేటు పెరిగిందని ఆమె అన్నారు. సిలిండర్ ధరలను తగ్గించాలన్నారు. కాగా జూలైలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50ల చొప్పున పెరిగింది. ఇప్పటి వరకు అలా చాలాసార్లు రేటు పెరిగింది.
ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్ధిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేసిన తర్వాత సామాన్య కుటుంబాలు వంట గ్యాస్‌పై సబ్సిడీని పొందడం లేదు. దాంతో చాలామంది మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారింది.
#WATCH: TMC MP Kakoli Ghosh Dastidar bites into raw brinjal in Parliament#Brinjal #Parliament #India #Viral #News #Breaking #KakoliGhoshDastidar #WestBengal #LokSabha #News #Trending #TMC pic.twitter.com/2Tz2AWdCBd
— Free Press Journal (@fpjindia) August 1, 2022
Advertisements