త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విదిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలకు కొందరు ప్రధానోపాధ్యాయులు అనుమతిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వేళ అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలని వెల్లడించింది.
‘ పాఠశాలల్లోని ఆటస్థలం సహా ఎలాంటి వనరులను రాజకీయ కార్యక్రమాల కోసం వినియోగించ కూడదు. ఒక వేళ అలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే విద్యాశాఖ అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి” అని పేర్కొంది.
సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత కార్యక్రమాలను సెలవు దినాలు లేదా పాఠశాల ముగిసిన తర్వాత మాత్రమే నిర్వహించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటాము” అని తెలిపింది.