హీరోయిన్ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రమ్య కృష్ణన్, బోనీ కపూర్, రాధిక శరత్‌కుమార్, గౌతమ్ మీనన్, ఖుష్బు, శోభన ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు.
త్రిష ఈ ఫోటోలకు #AboutLastNight #MyTribe అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక వచ్చే నెలలో దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం జరగనున్నందున త్రిష ఈ పార్టీని నిర్వహించినట్టు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే త్రిష… మణిరత్నం హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్‌లో నటిస్తుంది .
అలాగే తమిళ థ్రిల్లర్ రాంగి కూడా నటిస్తుంది. ఈ సినిమాను థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.