త్రిష కృష్ణన్ ప్రస్తుతం ‘రాంగి’ మూవీ పూర్తి చేశారు. ఈ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్రిష బిజీబిజీగ ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై చిన్నది చాలా అందంగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు.
గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో త్రిష నటించారు. 2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం’ సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.
పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు త్రిష తన తాజా చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఆమె బ్లాక్ అండ్ ఎల్లో కలర్ మిక్సింగ్ దుస్తులు ధధించారు.
వాటిని చూసిన అభిమానులు ఇంత అందాన్ని మేమెప్పుడు చూడలేదని కొందరు… ఇంత అందం మెయిటెన్ చేస్తున్నావు సరే పెళ్లెప్పుడు చేసుకుంటావని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.