కరోనా వైరస్ పుణ్యమా అని ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ప్రకటించటంతో అన్ని రంగాలవారు ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు సైతం ఇళ్లకే పరిమితం కావటంతో తారలు సోషల్ మీడియాలో మెరుస్తున్నారు. వాళ్లకి ఇష్టమైన పనులు చేసుకుంటూ దానిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే త్రిష మాత్రం డిఫ్రెంట్ గా లాక్ డౌన్ దెబ్బకు టిక్ టాక్ ను నమ్ముకుంది. పొట్టి నిక్కర్ వేసుకుని హోలీవుడ్ గాయని మేగాన్ నీ స్టాలియన్ సే వేజ్…కు డాన్స్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వీడియో అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.