మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి చేయనున్న మొదటి సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. చిరు 152 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఈషా రెబ్బ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈషా రెబ్బ ఒక హీరోయిన్ మాత్రమే కథలో మెయిన్ హీరోయిన్ గా ఇంకొకరు కనిపించే అవకాశం ఉంది, కొరటాల ఆ పాత్రకి సెట్ అయ్యే కథానాయిక కోసం చాలా కాలంగా వెతుకుతున్నాడు. లిస్ట్ లో చాలా పేర్లే వినిపించాయి, చివరికి సైరా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నయనతారనే ఈ మూవీలో నటిస్తుంది అనే వార్త కూడా వినిపించింది.
నయన్ ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా వెలుగుతున్న త్రిషాని ఫైనల్ చేశారని సమాచారం. చిరు పక్కన స్టాలిన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన త్రిషా, 13 ఏళ్ల తర్వాత అంటే దాదాపు దశాబ్దమున్నర తర్వాత మళ్లీ మెగాస్టార్ మూవీలో నటించబోతోంది. ఈ విషయమే త్వరలోనే కొణిదెల ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నాడు. అందుకే కొరటాల ఇద్దరు హీరోయిన్స్ ని సెట్ చేశాడు.