కరోనా ఎఫెక్ట్ దెబ్బకు ఇండియా అంతా ఇంటికే పరిమితం అయ్యింది. స్టార్ బిజినెస్ మ్యాన్ దగ్గర నుండి సామాన్య జనం వరకు ఇంటికే పరిమితం అయిపోయారు. 21 రోజుల ఖాళీ సమయాన్ని ఎవరికి వారు తమకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగి కనుమరుగైన హీరోయిన్ త్రిష వీడియో కాల్ ద్వారా రానా, బన్నీలతో సరదాగా గడిపిందట. వీరి ముగ్గురు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో… త్రిష గ్రూప్ కాల్ ద్వారా మాట్లాడుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది.
బన్నీ కన్నా కూడా రానాతో త్రిషకు మంచి అనుబంధం ఉంది. ఆ మధ్య కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంకు హజరైన రానా… త్రిష తనకు మంచి ఫ్రెండ్ అని, డేట్ కూడా చేశాం అంటూ ప్రకటించాడు.
త్రిషకు ఇప్పుడు తెలుగులో సినిమాలు లేవు. చిరంజీవి ఆచార్య సినిమాలో త్రిష నటిస్తుందని ప్రచారం జరిగినా… దర్శకుడు కొరటాల శివతో వచ్చిన్న గ్యాప్ వల్ల సినిమాకు దూరం అయిందన్న వార్త ప్రచారంలో ఉంది.