దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ జతకట్టబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ షూటింగ్… సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి కాగానే మొదలవ్వనుంది. అక్టోబర్ లో మహేష్ తన షూటింగ్ పూర్తి చేసుకోగా… త్రివిక్రమ్ మూవీ నవంబర్ ఎండింగ్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాను 2022 ఎండింగ్ కు రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించనుండగా… ఇతర నటీనటులు త్వరలో ఫైనల్ కాబోతున్నారు.
ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనుండగా, హారికా హసిని క్రియేషన్స్ తో పాటు జీఎంబీ నిర్మించనుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం బీమ్లా నాయక్ పర్యవేక్షణలో బిజీగా ఉన్నారు.