రెడ్ సినిమాతో మళ్లీ మాస్ ఆడియన్స్ ను మెప్పించేందుకు హీరో రామ్ రెడీ అయిపోయాడు. అప్పటి వరకు కేవలం లవర్ భాయ్ గానే పరిచయం ఉన్న రామ్… ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ను మెప్పించాడు. ఇప్పుడు రెడీ తో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే, రామ్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా రామ్ స్పందిస్తూ… ఇటీవలే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని, త్వరలోనే సినిమా ఉంటుందని… అయితే ఖచ్చితంగా ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని కామెంట్ చేశాడు.