మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌లు ఓ సినిమా చేస్తారు అన్నది పాత వార్తే. హారిక-హాసిని బ్యానర్‌లో ఈ సినిమా ఉంటుందని తెలిసినా… ఎప్పుడు సినిమా పనులు మొదలవుతాయి, ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అనేది మాత్రం చెప్పలేదు. అయితే… ఇటీవలే సినిమా షెడ్యూల్‌పై ఓ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
జబర్ధస్త్‌పై నాగబాబు సంచలన ఆరోపణ
గతంలో వెంకటేష్ సినిమాలకు త్రివిక్రమ్ రచయిగా పనిచేశారు. కానీ వెంకీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయటం ఇదే ప్రథమం కావటంతో… హై ఎక్స్‌పెక్టేషన్ నెలకొంది. ఇటీవలే వెంకీమామతో ప్రేక్షకులను నవ్వించిన వెంకీ త్వరలో అసురన్ రీమేక్ చేయనున్నారు. ఆ తర్వాత మూవీ త్రివిక్రమ్‌తోనే అనే టాక్ బలంగా వినపడుతుంది. వచ్చే ఏడాది మిడిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం సాగుతోంది.
పక్క మాస్ కథతో సాయిధరమ్ తేజ్ ?
మరీ ఇప్పటికైనా అనుకున్న టైంకే సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో… ఎప్పట్లాగే వాయిదాల పర్వం కొనసాగుతుందో చూడాలి. త్రివిక్రమ్ ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ఓ మూవీ చేస్తారన్న ప్రచారం ఉంది. జనవరి ఎండింగ్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు చేసుకోబోతుంది.