భారత దేశ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రామాయణం ఆధారంగా ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సరిగ్గా మూడేళ్ల కిందట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు బయటకి రాలేదు. కానీ ఈ సినిమా సంబందించి తెరవెనుక అన్ని పనులు జరుగుతున్నాయట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు డైలాగ్ రైటర్ గా మారడట.
లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ ను త్రివిక్రమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తెలుగులో రాసిన డైలాగులను సంభాషణలను హిందీ, తమిళ వెర్షన్ లలో రాస్తారట. దర్శకుడు నితీష్ తివారి, రవి ఉద్యవార్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించనున్నారు.