సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించటం విశేషం. మలయాళం లో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ గా మూవీ తెరకెక్కుతుంది.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు లో ప్రారంభం అయింది. అయితే పవన్ కోసం కథలో త్రివిక్రమ్ కీలకమైన మార్పులు చేస్తున్నాడట. తన స్టైల్ లో కామెడీ ను కూడా మిక్స్ చేసి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని క్రియేట్ చేసి పవన్ పాత్రకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. ఇక త్రివిక్రమ్ కు పవన్ పై ఎంత అభిమానం ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. పవన్ పై ఉన్న అభిమానాన్ని త్రివిక్రమ్ రాతల్లో కనిపిపించబోతుందని పవన్ కోసం రాసిన సీన్ లనే తిరగరాస్తూ మరింతగా పవన్ ను హైట్ చేస్తున్నాడని సమాచారం.