పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే లాలా భీమ్లా సాంగ్ ని కూడా త్రివిక్రమ్ రాశారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు ఎడిటింగ్ పై ఫోకస్ పెట్టాడట.
ఎడిట్ లో ఇప్పటికే అనేక మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.