మహేష్ కోసం దాదాపు ఏడాది నుంచి త్రివిక్రమ్ వెయిటింగ్. ఇన్నాళ్లకు ఆయన వెయిటింగ్ కు తెరపడింది. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా, వచ్చేనెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది. ఈ మేరకు మహేష్ కాల్షీట్లు కేటాయించాడు. రీసెంట్ గా అమెరికా వెళ్లి మరీ మహేష్ ను కలిసిన త్రివిక్రమ్, పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు.
దీంతో త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఫుల్ స్క్రీన్ ప్లే రెడీ చేసిన ఈ దర్శకుడు, దానికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. మరోవైపు కాస్టింగ్ పూర్తిచేసే పనిలో పడ్డాడు. తన డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో కొందరికి కాల్షీట్లు వేసే పని అప్పగించాడు. అటు హారిక-హాసిని సంస్థ, ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది.
మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభమౌతుంది. మేజర్ పార్ట్ షూటింగ్ ను ఇండియాలోనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల్ని అంచనా వేసుకొని, ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. పూజాహెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటించనుంది. మహర్షి తర్వాత వీరిద్దరు కలిసి స్క్రీన్ పై మెరవనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
ఈ మూవీ జానర్ ఏంటనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇంతకుముందు మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు త్రివిక్రమ్. ఈసారి ఫ్యామిలీ, ఫన్ ఎలిమెంట్స్ తో ఓ కథ రాసుకున్నట్టు తెలుస్తోంది.