టాలీవుడ్ లో కామెడి అంటే బ్రహ్మానందం, బ్రహ్మానందం అంటే కామెడి అనే విధంగా మారింది పరిస్థితి. ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే ఆయన ఉండాల్సిందే అంటారు జనాలు. అప్పట్లో ఆయన డేట్స్ దొరకక చాలా మంది సినిమాలు ఆలస్యం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే సినిమా ఫలితం మీద ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఇక ఆయన కారణంగా సినిమాలు కొన్ని మంచి హిట్ అయ్యాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఆయన కామెడినే హైలెట్. ఆ సినిమాల లిస్టు ఒకసారి చూద్దాం. అత్తారింటికి దారేది సినిమాలో ఆయన కామెడి సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే జల్సా సినిమాలో కూడా ఆయన కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా వసూళ్లు పెరగడంలో ఆయన పాత్ర కూడా ఎక్కువే ఉంది.
అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఆయన పాత్ర బాగా హిట్ అయింది. జులాయి సినిమాలో కూడా బ్రహ్మానందం పాత్ర బాగా హైలెట్ అనే చెప్పాలి. ఆ సినిమాలో ఆయన కామెడి సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక నువ్వు నాకు నచ్చావ్, అతడు సినిమాల్లో కూడా ఆయన చాలా బాగా కామెడి చేసారు. ఇలా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఆయన కామెడి లేకపోతే సినిమా చూడలేం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి.