యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా 2020 జూలై నెలలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. RRR తర్వాత మరో సినిమాకు ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నాడు జూనియర్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. కానీ RRR లాంటి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత ఫ్యామిలీ తరహాలో కాకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉండేలా ప్లాన్ చేయాలని త్రివిక్రమ్‌కు సూచించాడట జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.