సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని కలెక్షన్ల పరంగా కూడా మంచి రికార్డు అందుకుంది. అయితే మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి… ఎవడితో సినిమా చేశాడు అనే సందిగ్దత మహేష్ బాబు ఫాన్స్ లో నెలకొంది. ఇటువంటి సమయంలో ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు కు అతడు, ఖలేజా లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ ముచ్చటగా మూడో సారిజతకడుతున్నారని సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ముగించుకుని ఎన్టీఆర్ కు కాస్త సమయం పెట్టె అవకాశం కనిపిస్తుంది. ఈ గ్యాప్ లో మీరు ఫ్రీగా ఉంటే సినిమా చేసేద్దాం అని మహేష్ ఆఫర్ ఇచ్చాడట. మరి అందుకు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వెయిట్. చేస్తారా మహేష్ తో సినిమా చేస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.