డైరెక్టర్ త్రివిక్రమ్ గురువు గారి రుణం తీర్చుకోబోతున్నాడా? ఆ మధ్య రెడ్ మూవీ ప్రమోషన్‌లో నిర్మాత స్రవంతి కిషోర్ గురించి మాట్లాడుతూ ఆయన లేకుంటే తాను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదంటూ ఆయన చేసి సాయాన్ని గుర్తు చేసుకున్న త్రివిక్రమ్.. ఇక ఇప్పుడు నిర్మాత స్రవంతి రవికిషోర్‌కు గురుదక్షిణ చెల్లించుకోబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.త్రివిక్రమ్ తన తదుపరి మూవీని స్రవంతి కిషోర్ బ్యానర్‌లో రామ్ హీరోగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రామ్ కోసం ప్రత్యేకంగా కథ రాయడం కాకుండా.. ఇప్పటికే పవన్ కోసం సిద్ధం చేసిన ఓ సినిమాలో ఓ కీ రోల్‌ను సెట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. అంటే త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ.. తన ఫస్ట్ మల్టీస్టారర్ మాత్రమే కాకుండా.. టాలీవుడ్‌లోనే మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా మారబోతోందన్న మాట.