రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జాన్ ‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. సాధ్యమైనంత తొందరగా చిత్రీకరణ పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలని దర్శకుడు రాధాకృష్ణ పట్టుదలతో ఉన్నారు.
అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సినిమా చేస్తారనినే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభాస్ ఇంతవరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి సినిమా చేయలేదు. అందుకే తన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. ముందుగానే త్రివిక్రమ్‌కి ప్రభాస్ ఓ కథను సిద్ధం చేయాలని సూచించాడని .. దీంతో ఆయన ఆ పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు.