కామెడీ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా ట్రై చేశాడు. కానీ అనుకున్నంతగా సునీల్ నిలదొక్కుకోలేకపోవటంతో చేతిలో సినిమాలు లేక ఖాళీ అయిపోయాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కామెడీ పాత్రలకు ఓకే చెప్పాల్సి వచ్చింది.
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినా… పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే ఈ రెండు సినిమాల్లో తన ప్రియ స్నేహితుడు సునీల్‌కు అవకాశం ఇచ్చింది డైరెక్టర్ త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ అనుకున్న రేంజ్‌లో సునీల్‌కు హైప్ రాకపోవటంతో… సునీల్ కోసం త్రివిక్రమ్‌లోనూ టెన్షన్ పెరిగిపోయిందట.
అందుకే ఈసారి తన నెక్ట్స్ సినిమాలో సునీల్‌కు మరింత కీలకమైన రోల్‌తో పాటు, మంచి కామెడీ పండించే సీన్స్ ఇచ్చేలా పెన్‌కు పని చెబుతున్నాడట త్రివిక్రమ్. ఈసారి సునీల్‌ను ఎలాగైనా మరోసారి ట్రాక్‌లోకి తీసుకరావాలన్న కసితో ఉన్నాడని తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన త్రివిక్రమ్… తన నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు. ఈ సినిమాలో సునీల్‌కు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దక్కబోతుందని ఫిలింనగర్ వర్గాల టాక్.