బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ను సాధించిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే భారీ అంచనాల నడుమ తెరకెక్కతోన్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అంటే సరైన సమాధానం మాత్రం రావడంలేదు. రీమేక్ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. పవన్ తాజాగా నటిస్తోన్న పింక్ రీమేక్ అంచనాలను అందుకోలేకపోవచ్చుననే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా అదే తరహా అభిప్రాయాన్ని మూటగట్టుకుంటోంది. పవన్ మెస్మరైజ్ చేసినా.. కథల విషయానికి వచ్చేసరికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చుననే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. పవన్ కూడా కొంత వరకు ఈ వాదనలో కూడా నిజం లేదనే అనుకుంటున్నాడట.
పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక చాలాకాలం తరువాత పవన్ మోహనికి రంగేసుకుంటుంటున్నాడు. పింక్ రీమేక్ తో అదిరిపోయే హిట్ అందుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. అందుకు తగ్గ సక్సెస్ ను అందుకోకపోతే బాగోదని పవన్ అనుకున్నాడో ఏమో కానీ తన మిత్రుడు త్రివిక్రమ్ ను సంప్రదించాడట. తన కోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేయాలనీ త్రివిక్రమ్ ను కోరాడట. అందుకు ఆయన కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక పవన్ కోసం సూపర్ స్టోరీని సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని ఫిలింగన్ వర్గాల కథనం.