మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ కు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. గతంలో ఆమె ఎన్నో చక్కటి పాటలను పాడారు. అమృతా ఫడ్నవీస్ గొప్ప గాయనిగా పరిచయం. ఆమె పాడిన ‘మూడ్ బనా లియా’ సాంగ్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ సాంగ్ పది లక్షలకు పైగా వ్యూస్ సాధించాయి. ఆ పాటలో అమృతా డ్యాన్స్ కూడా చేసింది.
అమృత ఫడ్నవీస్ ‘మూడ్ బనా లియా’ సాంగ్ టి సిరీస్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు అమృతా ఫడ్నవీస్ ను కూడా ట్రోల్ చేశారు.
ఈ సాంగ్ ను అమృత ఫడ్నవీస్ విడుదల చేసే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ‘మూడ్ బనా లియా’ చూశారా? అని కొందరు ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానం చెబుతూ.. చూశారని తెలిపారు. ట్రోలింగ్ కు భయపడటం లేదన్నారు. కానీ అన్ని పాటలు అందరికీ ఇష్టం కావు. ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారు.
కాబట్టి సగం జనాభా నుంచి ట్రోలింగ్స్ వస్తూనే ఉంటాయని చెప్పారు. కాగా ఇంతకు ముందు అమృత పాటలు కొన్ని విడుదలయ్యాయి. సోషల్ మీడియా నుంచి కూడా విశేష స్పందన లభించింది. అలాగే ట్రోలింగ్ కూడా ఎదురయ్యింది.